Anasuya Bharadwaj | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్లో నటించిన ప్రాంఛైజీ పుష్ప. సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో వచ్చిన పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్లో (Pushpa The Rule) అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) పోషించిన దాక్షాయణి పాత్రకు ఏ రేంజ్లో రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ప్రేక్షకులు పుష్ప ది రైజ్ విడుదలైనప్పుడు నా పాత్రను మరింత ఎక్కువ సేపు ఉంటే చూడాలని ఉందన్నారు. కానీ ఇప్పుడు మాత్రం పుష్ప 2 కంటే పుష్ప 1లో నా పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉందంటున్నారు. నా పాత్రకు పరిమిత సమయం పెట్టారని ప్రేక్షకులు నిరాశ చెందితే.. నేను సంతోషించే విషయం. అదొక ప్రశంసలా భావిస్తానంది అనసూయ.
అంతేకాదు సినిమా అనేది దర్శకుడి కల. సుకుమార్ దాక్షాయణి పాత్ర కోసం నన్ను సంప్రదించినప్పుడు.. ఆ రోల్ రంగస్థలంలో రంగమత్త పాత్రలా ఉండదని క్లారిటీ ఇచ్చారు. మంగళం శ్రీనుకు సంబంధించి భార్య పాత్ర కీలకంగా ఉంటుంది. సుకుమార్ ఆ పాత్ర చేసేందుకు ఎవరో ఒక పాపులర్ యాక్టర్ కావాలనుకున్నారు. అయితే ఆ పాత్రలో గొప్పగా ఏమీ ఉండదని కూడా సుకుమార్ సార్ స్పష్టం చేశారంటూ చెప్పుకొచ్చింది.
Union Budget 2025 | గంటా 15 నిమిషాల పాటు కొనసాగిన నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం