ఉట్నూర్ : మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ ప్రారంభం నుంచి 2025 వరకు పాఠశాలలో చదువుకున్న పూర్వవిద్యార్థులు ( Almuni ) వజ్రోత్సవ వేడుకలను (Diamond jubilee Celebrations ) ఆదివారం ఘనంగా నిర్వహించారు. 1950 నుంచి 2025 వరకు టెన్త్ క్లాస్ బ్యాచ్‌ల ( Tenth Class ) పూర్వ విద్యార్థులు మండలంలోని జేఎస్ఎన్ పంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు.
వేదికపై నాటి గురువులను బ్యాండు మేళాలతో స్వాగతం పలికి సన్మానించి, గత స్మృతులను నెమరువేసుకున్నారు. తమ పాఠశాల రోజులను గుర్తు చేసుకొని, ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎంపీ గోడం నగేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన కమిటీ సభ్యులను ప్రశంసించారు.
ఉపాధ్యాయల సూచించిన మార్గంలోనే ప్రస్తుతం వివిధ రంగాల్లో, హోదాల్లో ఉన్నామని సభ్యులు అన్నారు. సమాజాన్ని దశ, దిశ ను మార్చే విధంగా ఉపాధ్యాయుల కృషి ఎన్నటికీ మరువలేనిదన్నారు. ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ తాను ఇదే పాఠశాలలో ఛాత్రోపాద్యానీయుగా పని చేశానని గుర్తు చేశారు.