వాంకిడి : కేంద్ర రోడ్డు , రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ( Nitin Gadkari ) రాక సందర్భంగా మండల వాసులు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ ( Asifabad ) జిల్లా లోని వాంకిడి మండలం మీదుగా 363 జాతీయ రహదారిని నిర్మించారు. నిర్మాణంలో భాగంగా జాతీయ రహదారి ఇరువైపులా డ్రైనేజీ తవ్వారు. అయితే డ్రైనేజీ నిర్మించడాన్ని మరిచిపోవడాన్ని నిరసిస్తూ సోమవారం ఆందోళన చేపట్టారు. డ్రైనేజీలను పూర్తి చేసిన తరువాతనే రోడ్డును ప్రారంభించాలని కోరుతూ నిరసన చేపట్టారు.
సంబంధిత కాంట్రాక్టర్కు ,అధికారులకు సమస్యలను ఎత్తి చూపిన చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అసంపూర్తిగా వదిలేసిన డ్రైనేజీతో మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే కాలనీవాసులకు శాపంగా మారిందని పేర్కొన్నారు. ధర్నాలో మండల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.