తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూర్( Tandur ) మండలం రేచినిరోడ్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం గుర్తు తెలియని మృత దేహాన్ని ( Dead Body ) పోలీసులు గుర్తించారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ ( Head Constable ) కే సురేష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మృతుడి వయస్సు 60 నుంచి 65 సంవత్సరాలు ఉంటుందని వివరించారు.
బల్లర్ష నుంచి మంచిర్యాల వైపు వెళ్లే గుర్తు తెలియని రైలు బండి నుంచి పడిపోయి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితమే మరణించి ఉంటాడని, మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. మృతుడు బాల్ హెడ్, తెల్లని గడ్డం కలిగి , బ్లాక్ కలర్ టీ షర్ట్, కాకి పాయింట్ ధరించాడని వివరించారు. మృతుని సమాచారం తెలిస్తే 99484 81902, 87126 58596, 87126 58605 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.