ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా (Adilabad ) బీర్సాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఈర్ల రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఉట్నూరు మండలం బీర్సాయిపేట వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను ఉట్నూర్ దవాఖానకు తరలించారు.