మంచిర్యాల, నవంబర్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రం సపోర్టు లేకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో రూ.వేల కోట్లు తీసుకొచ్చి చెన్నూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చె న్నూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ అన్నారు. మందమర్రిలో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ 2018లో ఇక్కడ పోటీ చేయమన్నారని, మీరంతా నన్ను ఆశీర్వదించి గెలిపించుకున్నారన్నారు. మీరంతా నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్నడూ లేనంత అభివృద్ధి చేశానన్నారు. చెన్నూర్, రామకృష్ణాపూర్, మందమర్రి మున్సిపాలిటీలకు రూ.700 కోట్లకుపైగా నిధులు తీసుకువచ్చానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు అందించేందుకు రూ.1658 కోట్లతో చెన్నూర్ ఎత్తిపోథల పథకంతో పాటు మందమర్రి మండలంలో రూ.500 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ మంజూరు చేయించామన్నారు. అంతేగాకుండా 22 వాగులపై బ్రిడ్జిలు, ఎన్నో కిలో మీటర్ల మేర ఇంటర్నల్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు, గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, మం డల కేంద్రాల నుంచి నియోజకవర్గ కేంద్రానికి ఎ న్నో కిలో మీటర్ల మేర రోడ్లు నిర్మించామన్నారు. జీ వో 76 కింద రామకృష్ణాపూర్లో 4వేల కుటుంబాలకు ఇండ్ల పట్టాలు అందించామని తెలిపారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీని మరోసారి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
20 ఏండ్ల పాటు కేసీఆర్ వెంటే..
2003లో యూనివర్సిటీకి పోయినప్పటి నుంచి నేటి వరకు 20 ఏండ్ల పాటు కేసీఆర్ వెంటే ఉన్నానని బాల్క సుమన్ అ న్నారు. అది ఉద్యమమైనా, ఈనాడు అభివృద్ధి ప్రస్తానమైనా కేసీఆర్ వెంటే ఉన్నానన్నారు. కానీ మీ లా అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చలే, కండువాలు మార్చలేదని వివేక్‌పై విమర్శలు గు ప్పించారు. నీతి.. నిజాయితీతో, నిబద్ధతతో నమ్ముకున్న నాయకుడి కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాం తప్పా పార్టీలు మారలేదన్నారు. వాళ్ల నాన్న వెంకటస్వామి, అన్న వినోద్, వివేక్ ఇక్కడి నుంచి పరిపాలన చేసి చెన్నూర్ నియోజక వర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. బెల్లంపల్లి, చెన్నూర్ నియోజక వర్గాల్లో అన్నదమ్ములిద్దరూ అర్రస్ పాట పాడి నాయకులను కొంటున్నారని, వారికి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దుర్గం చిన్నయ్య దళిత బిడ్డ అయితే, బాల్క సుమన్ కేసీఆర్ తయారు చేసిన ఉద్యమ బిడ్డ అని, నిస్వార్థంగా పని చేస్తూ అభివృద్ధి చేస్తుంటే.. వందల కోట్లు ఖర్చు చేసి మాపై గెలవాలని చూస్తున్నారని.. ఇది ప్రజలు గమనించాలన్నారు. వరదలు వచ్చినా, కరోనా వచ్చినా నియోజకవర్గాల్లో ప్రజలకు అం డగా మేమున్నామన్నారు. నాలుగేండ్ల 11 నెలలు ఇక్కడ ఎవ్వరూ ఉండరని.. ఎలక్షన్లు వస్తే సూటుకేసులతో ఇక్కడికి చేరుకుంటారని.. ఇది ప్రజలు గమనించాలన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను పలు కోరికులు కోరారు. ఆ వివరాలు ఇలా…
బీఆర్ఎస్లో చేరికలు..
ప్రజా ఆశీర్వాదసభలో భాగంగా బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పలువురు కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్ సీపీ నాయకులు గులాబీ కండువాలు కప్పుకున్నారు. ముఖ్యమంత్రి సభకు చేరుకొని ప్రజలకు అభివాదం చేసిన అనంతరం చెన్నూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి బోడ జనార్దన్‌తోపాటు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ రాజా రమేశ్, వైఎస్ఆర్ సీపీ నియోజక వర్గ ఇన్చార్జి నగేశ్, బీజేపీ సీనియర్ నాయకుడు పత్తి శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.