తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ఐడీసీ) చైర్మన్‌గా నియామకమైన సముద్రాల వేణుగోపాలాచారి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల తన కార్యాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.
మంత్రి వెంట ముథోల్ ఎమెల్యే విఠల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు లోక భూమారెడ్డి, రాంకిషన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్‌రెడ్డి ఉన్నారు.
– నిర్మల్ అర్బన్/భైంసా, జనవరి 5