Tribal School | కోటపల్లి, జులై 9 : మంచిర్యాల జిల్లా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. బుధవారం ఉదయం ఒక్కసారిగా పాఠశాల నుండి బయటకు వచ్చిన విద్యార్థులు రోడ్డు పైకి వచ్చి పీవో మేడమ్ రావాలి అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపైన కూర్చున్నారు. కాగా పాఠశాల హెచ్ఎం వేధింపుల కారణంగా నె విద్యార్థులు ఆందోళన బాట పట్టినట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఇలానే విద్యార్థులు రోడ్డుపైకి రాగా పాఠశాల హెచ్ఎం వారిని బుజ్జగించి పాఠశాలలోకి తీసుకెళ్లాడు. కాగా ఈ విషయమై పూర్తి విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేసియాల్సిన ఐటీడీఏ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం కారణంగా మరోసారి విద్యార్థులు రోడ్డు పైకి ఎక్కినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలికల పాఠశాలలో మహిళ హెచ్ఎం ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఎదురుకావనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ విషయమై విచారణ జరిపితే పూర్తి విషయాలు వెల్లడి కానున్నాయి.