నార్నూర్ : ప్రభుత్వ ఉద్యోగస్తులకు (Government Employees) బదిలీలు సహజమేనని తహసీల్దార్ జాడి రాజలింగం ( Rajalingam ) అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో బదిలీపై వెళుతున్న ఐకెపీ ఏపీఎం మైసా రమేష్‌కు వీడ్కోలును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగస్తులకు బదిలీలు, పదవీ విరమణలు సహజమేనని అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ప్రజలతో మమేకమై పనిచేసినప్పుడు ఉద్యోగికి మంచి గుర్తింపు వస్తుందన్నారు. అనంతరం కార్యాలయం సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు కలిసి ఏపీఎంను శాలువతో సన్మానించారు. ఈ సమావేశంలో డీపీఎం జ్ఞానేశ్వర్, ఎంపీడీవో రాథోడ్ గంగా సింగ్, సీసీలు కాంబ్లే సంతోష్, రాథోడ్ సంతోష్, రేవయ్య, శ్రీరామ్, సత్య శీల, మహిళా సంఘాల సభ్యులు ,తదితరులు ఉన్నారు.