ఆదిలాబాద్ : జిల్లాలోని బేల మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ప్రతి ఏడు లాగే ఈ ఏడాది గంగమ్మ తల్లికి బోనం ( Gangamma Bonam) సమర్పించుకునేందుకు తన నానమ్మ బంధువులతో మండలంలోని సాంగిడి గ్రామ పెనుగంగ ( Penuganga ) వద్దకు శుక్రవారం బోనం సమర్పించేందుకు వెళ్లారు.
ఈ క్రమంలో బెతం సాయిదీప్ (14) బాలుడు పెనుగంగా వాగులో స్నానం చేస్తూ నానమ్మ, బంధువులు చూస్తుండగానే నీటి గుంతలోకి జారుకున్నాడు. దీంతో బాలుడిని కాపాడేలోపే మునిగిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పెనుగంగా వద్దకు చేరుకొని బాలుడు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.