ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ( Adilabad ) జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడి ( Lightning ) ఆరుగురు మృతి చెందారు. వ్యవసాయ కూలీ పనుల కోసం బేల మండలంలో వ్యవసాయ పనులకు వెళ్లిన మహిళలు ( Women Labours) వర్షంలో పనిచేస్తుండగా ఒక్కసారిగా పిడుగులు పడడంతో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని బేల మండలంలోని సాంగిడిలో గేడం నందిని, సోన్కాస్ గ్రామంలో కోవ సునిత పొలంలో విత్తనాలు నాటుతుండగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు.
నార్నూర్ మండలం పిప్పిరిలో సైతం నలుగురు వ్యవసాయ కూలీలపై పిడుగు పడి అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు ప్రాథమిక సమచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటన విషయం తెలియగానే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. సంబంధిత అధికారులకు , పోలీసులకు సమాచారం అందజేశారు. కాగా భారీ వర్షం కారణంగా జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలు జలమయంగా మారాయి.