కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరంట్ ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు, బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌ను రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచనపై మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఖబడ్దార్ రేవంత్.. కాంగ్రెస్ డౌన్‌డౌన్.. అంటూ నినాదాలు చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కాగా, నేడు ఉమ్మడి జిల్లాలో నిరసనలకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు.
చెన్నూర్, జూలై 11 : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, విప్ సుమన్ పిలుపు మేరకు చెన్నూర్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెల దామోదర్‌రెడ్డి, ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, సర్పంచ్‌లు బుర్ర రాకేశ్‌గౌడ్, సెడంక పున్నం, రాజన్న, దెబ్బ రవి, ఎంపీటీసీలు నగావత్ శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ రేవెల్లి మహేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రుద్రబట్ల సంతోష్, మానికరౌతు శంకర్, బీఆర్ఎస్ నాయకులు నర్సింహాచారి, తుమ్మల తిరుపతిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రవి గౌడ్, గోదారి రమేశ్ పాల్గొన్నారు.
కోటపల్లి, జూలై 11 : పారుపల్లి గ్రామం సమీపంలోని జాతీయ రహదారి నం.63 పై బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని, ఆ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు వ్యవసాయానికి మూడు గంటలపాటు కూడా కరెంట్ ఇవ్వలేదని విమర్శించారు. పీఏసీఎస్ చైర్మన్ పెద్దపోలు సాంబాగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎరినాగుల ఓదెలు, బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మారిశెట్టి విద్యాసాగర్, సర్పంచ్‌లు పెద్దింటి పున్నచంద్, దాగామ రాజు, రాజాగౌడ్, ఎంపీటీసీ చంద్రగిరి శంకరయ్య, ఏఎంసీ డైరెక్టర్ గాదె శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు కొట్టె నారాయణ, మానిశెట్టి మల్లయ్య, గడ్డం లచ్చయ్య, లాపాక రాజమౌళి, ఆసంపల్లి సంపత్, రాగం స్వామి, పిల్లి సమ్మయ్య, పూరెళ్ల సతీశ్, అంగ మల్లయ్య, తనుగుల రాజలింగు, కామెర సమ్మయ్య, ఆసంపల్లి అనిల్, తాళ్ళపెల్లి బాపు పాల్గొన్నారు.
జైపూర్, జూలై 11 : జైపూర్ మండల కేంద్రంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మతో ఆందోళన చేపట్టారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రైతులు తగిన గుణపాఠం చెబుతారన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అరవిందరావు, జడ్పీటీసీ మేడి సునీత, ఎంపీపీ రమాదేవి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఉన్నారు.
నెన్నెల, జూలై 11 : నెన్నెల మండల కేంద్రంలో ఏఎంసీ డైరెక్టర్ తోట మధు, మన్నెగూడెం సర్పంచ్ బాపు, బీఆర్ఎస్ నాయకులు భీమరాజుల శ్రీనివాస్, కీసరి సంతోష్, గడ్డం స్వామిగౌడ్, బిర్దు శ్రీనివాస్, పల్ల బానేష్, రాకేశ్, రైతులు ఆందోళన చేపట్టారు. ఉచిత విద్యుత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు.
మందమర్రి, జూలై 11: మందమర్రి పట్టణంలోని కోల్‌బెల్ట్ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సుమారు గంటపాటు రాస్తారోకో చేయడంతో బెల్లంపల్లి, రామకృష్ణాపూర్ వెళ్లాల్సిన వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. కార్యక్రమంలో బీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా, యువజన విభాగం, మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కెరమెరి, జూలై 15 : మండలంలోని సాంగ్వి రైతు వేదికలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహ నం చేశారు. ఎంపీపీ పెందోర్ మోతీరాం, వైస్ ఎంపీపీ సయ్య ద్ అబూల్ కలాం, ఎంపీటీసీ కోట్నాక సక్కారాం, సర్పంచులు తొడసం జగన్నాథ్రావ్, ఆదే నారాయణతో పాటు బీఆర్ఎస్ నాయకుడు కుమ్రం భీంరావ్ పాల్గొన్నారు.
రెబ్బెన, జూలై 11 : రెబ్బెన మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వేముర్ల సంతోశ్, వైస్ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, కో ఆప్షన్ మెంబర్ జౌరొద్దీన్, ఎంపీటీసీలు పెసరి మధునయ్య, వోల్వోజి హరిత, సర్పంచ్‌లు చెన్న సోమశేఖర్, బొమ్మినేని అహల్యాదేవి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యురాలు కుందారపు శంకరమ్మ, బీఆర్ఎస్ మహిళా మండలాధ్యక్షురాలు అన్నపూర్ణ అరుణ, నాయకులు పందిర్ల మధునయ్య, జుమ్మిడి అనందరావు, వినోద్‌జైస్వాల్, మన్యం పద్మ ఉన్నారు. తిర్యాణి, జూలై 11 : మండలంలోని చింతపల్లి రైతు వేదికలో జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు బొమ్మగోని శంకర్ గౌడ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. తిర్యాణి ఉప సర్పంచ్ తోట లచ్చన్న, పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, వైస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, రమేశ్, శంకరయ్య ఉన్నారు. జైనూరు, జూలై 11 : మండలంలోని రాసిమెట్ట రైతు వేదిక వద్ద రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాల సర్పంచ్ ఆత్రం గిరిజాబాయి, నాయకులు మేస్రాం అంబాజీరావ్ ఉన్నారు. నార్నూర్, జూలై 11 : నార్నూర్ మండల కేంద్రంలోని రైతువేదిక భవనం ప్రాంగణంలో బీఆర్ఎస్ శ్రేణులు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దాహనం చేశారు. పీఏసీసీ ఇన్చార్జి చైర్మన్ ఆడే సురేశ్, కోఆప్షన్ సభ్యుడు షేక్ దస్తగిరి, పట్టణాధ్యక్షుడు ఫిరోజ్‌ఖాన్ ఉపాధ్యక్షుడు రాథోడ్ శివాజీ, నాయకులు కనక ప్రభాకర్, మెస్రం మానిక్రావ్, షేక్ దాదేఅలీ, విద్యారాణి ఉన్నారు.
జిల్లా రైతాంగం నిరసనలు చేపట్టాలి
– మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపు
నిర్మల్ అర్బన్, జూలై 11 : 24 గంటల ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.