ఎదులాపురం, ఫిబ్రవరి 22: సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తెలిపారు. ఆదిలాబాద్‌లోని రాంలీల మైదానంలో ఏర్పాట్లను ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడారు. ఈ ఏడాది సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను అందరం కలిసి మెలిసి ఘనంగా నిర్వహించుకుందామని చెప్పారు. బంజరాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడులను ఘనంగా జరిపేంపేందుకు సీఎం కేసీఆర్ అన్ని చర్యలు తీసుకుటున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సోయం బాపురావ్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్, రేఖా నాయక్, అత్రం సక్కు, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావు, టీఎస్ డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆకుల ప్రవీణ్, ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఐటీడీవో పీవో అంకిత్ హాజరుకానున్నట్లు వివరించారు. ఆయన వెంట ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షుడు జాదవ్ రమేశ్, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ పవార్, ప్రధాన కార్యదర్శి జాదవ్ బలిరాం, సలహాదారులు రూపావత్ అమర్ సింగ్, వినాయక్‌రావ్,రాథోడ్ హీరాలాల్ నాయక్, రాథోడ్ సురేశ్ నాయక్, కోశాధికారి సుభాష్ నాయక్ ఉన్నారు.
ఈ నెల 23న ఆదిలాబాద్‌లోని రాంలీలా మైదానంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయం తి ఉత్సవాలు అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఈ సెలవు మార్చి12న రెండో శనివారం వర్కింగ్ డేగా ఉంటుందని వెల్లడించారు.