నేడు రంజాన్.. ప్రత్యేక ప్రార్థనలకు మసీదులు, ఈద్గాల వద్ద ఏర్పాట్లు
ముస్లింల పవిత్ర పండుగ అయిన ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ను శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు మసీదులు, ఈద్గాల వద్ద అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఎదులాపురం( బేల) /భైంసా మార్చి 20: ముస్లింల పవిత్ర పండుగ అయిన ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ను శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు మసీదులు, ఈద్గాల వద్ద అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదిలాబాద్లో ఈద్గా మైదానంలో ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. పట్టణంలో ముఖ్యమైన ప్రదేశాలలో 250 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆయన వెంట ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, సీఐలు బీ సునీల్ కుమార్, కే నాగరాజు, ప్రణయ్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భైంసా పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద ఉన్న ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లను నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల పరిశీలించారు. బందోబస్తుపై పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆమె వెంట ఏఎస్పీ సాయికిరణ్, పట్టణ సీఐ సాయికుమార్, రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, తదితరులున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

