నెన్నెల/వేమపల్లి/కన్నెపల్లి/తాండూర్/దహెగాం/పెంచికల్పేట్, జూన్ 21 : మంచిర్యాల జిల్లాలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. నెన్నెల మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడగా, చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తహసీల్దార్ కార్యాలయం, పీహెచ్సీకి వెళ్లే దారిలో రెండు భారీ వృక్షాలు పడిపోగా, రాకపో కలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లంబాడీతండా లోని పలు ఇండ్ల పై రేకులు ఎగిరిపోయాయి. నెన్నెల సర్పంచ్ ఇబ్రహీం విరిగి పడిన చెట్లను జేసీబీ సాయంతో తొలగింపజేయగా, రాకపోకలు సాగాయి.
వేమనపల్లి మండలం జిల్లెడ, జక్కెపల్లి, బుయ్యారం, సూరారం, నా గారం, చామనపల్లి గ్రామాల్లో సోమవారం మధ్యాహ్నం గంటపాటు భారీ వర్షం కురిసింది. నాగారం నుంచి మంగెనపల్లి వరకు ఉన్న మట్టి రోడ్డు బురదమయంగా మారడంతో పాటు గుంతల్లో నీరు నిలిచిపోవడంతో వా హనదారులు ఇబ్బందులు పడ్డారు. జిల్లెడ సమీపంలోని బెల్లంపల్లికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న గుంతల్లో వర్షం నీరు చేరగా, వాహనదారులు గుంతల్లో అదుపు తప్పి పడ్డారు. కన్నెపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో వేప చెట్టు కూలి ఇండ్ల మధ్యన పడింది.

బోయ బాన య్యకు చెందిన ఇల్లు కూలిపోయింది. మొక్కంపల్లిలో మోర్ల వసంతకు చెందిన ఇంటి రేకులు ఎగిరిపోయాయి. తాండూర్ మండలం కాసిపేట గ్రామానికి చెందిన కొండపల్లి గంగా ఇంటి ప్రహరీ వర్షానికి కూలిపోయింది. కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. బాధి త కుటుంబం నష్టపోవడంతో సంబంధిత అధికారులు స్పందించి సాయమందించాలని గ్రామస్తులు కోరుతు న్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండ లంలో ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన పడిం ది.
అక్కడక్కడా విద్యుత్ స్తంభాలు పడిపోయి సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల ఇండ్ల పై రేకులు లేచిపోయి నాయి. పెంచికల్పేట్ మండలం పోతపల్లిలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాలో అంతరా యం కలిగింది. కొండపల్లిలో ఉషనబోయిన సంతోశ్ ఇం టి పై రేకులు గాలికి కొట్టుకుపోయా యి. ఇంట్లోని సామ గ్రి తడిసింది. అక్కడక్కడా చెట్లు నేలకొరిగాయి. అగర్గూ డ గ్రామ పరిధిలోని ఆగర్గూడలో రాంటెంకి పోచయ్యే అనే రైతుకు చెందిన మేక పిడుగుపాటుకు మృతి చెందిం ది. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని ఆయన వేడుకుంటున్నాడు. కాగా, ఈ వర్షం పంటల సాగుకు అనుకూలమంటూ పలువురు రైతులు పేర్కొన్నారు.

