ఇంద్రవెల్లి/భైంసా, మే 23 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన బిలాల్ ఫారీక్(40), నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని భట్టిగల్లికి చెందిన కూలీ ఏనుపోతుల బాబన్న (52), గోపాల్‌నగర్‌కు చెందిన సాత్వె శంకర్ (50) శనివారం వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన బిలాల్ ఫారీక్ కొన్నేండ్లుగా మతిస్థిమితి కోల్పోయి తిరుగుతున్నాడు. ఇటీవల మ హారాష్ర్టలోని కిన్వాట్ తాలూక గొట్టి గ్రా మానికి చేరుకున్నాడు.
ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో శనివారం వడదెబ్బకు గురై మృతిచెందాడు. గొట్టి గ్రామస్తులు కిన్వాట్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కుటుంబీకులు కి న్వాట్కు చేరుకున్నారు. వడదెబ్బతో మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించినట్లు ఫారీక్ కుటుంబీకులు తెలిపారు. అలాగే నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని భట్టిగల్లికి చెందిన కూలీ ఏనుపోతుల బాబన్న (52) రెండు, మూడు రోజులుగా కూలీ పనులకు వెళ్తున్నాడు.
శనివారం గాంధీగంజ్‌లో పనిచేస్తుండగా.. మొక్కజొ న్న కుప్ప వద్ద కింద పడి మృతి చెందాడు. బాబన్నకు కుమారుడు, కూతురు ఉన్నా రు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గో పాల్నగర్కు చెందిన సాత్వె శంకర్ గాంధీగంజ్‌లో కూలీ పని చేస్తూ జీవనం సాగించేవాడు. శనివారం ఉదయం పనిచేసే చో ట అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోవడంతో స్థానికులు గమనించి ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. శంకర్ భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నాని పోలీసులు తెలిపారు.