దిలావర్పూర్, ఆగస్టు 30 : తమ ఊరిలో ఊర పందులతో ప్రాణాలు పోతున్నాయని, తమ పిల్లలకు వ్యాధులు వస్తున్నాయని, అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన దిలావర్పూర్ గ్రామస్తులు శనివారం ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఉదయం 9 గంటలకే చేరుకుని గే టు ఎదుట భైఠాయించారు. అధికారులను కార్యాలయాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. నిర్మల్ కలెక్టర్ రావాలని నినాదాలు చేశారు.
గ్రామం నుంచి పందులను తరలించే వరకు కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. దాదాపు మూడు గంటలకు పైగా ఆందోళన నిర్వహించారు. తహసీల్దార్ ఏజాజ్ హమ్మద్ఖాన్ చేరుకుని ఉన్నతాధికారులతో మాట్లాడారు. మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తహసీల్దార్, ఇతర మండల అధికారులకు వినతిపత్రం అందించారు.