కాగజ్‌నగర్, నవంబర్ 1 : కోసిని జీపీ పరిధిలోని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగినట్లు రూరల్ ఎస్ఐ మహేందర్ తెలిపారు. రాత్రి ఎవరూలేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తు లు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువా పగులగొట్టి విలువైన పత్రాలు దొంగలించారు.
సిర్పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి నక్క మనోహర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.