తలమడుగు, డిసెంబర్ 18 : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని భరంపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్(ఎస్టీ రిజర్వు)ను 69 ఏండ్లుగా గ్రామస్తులందరూ ఐకమత్యంగా ఉండి ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటు వేసేవారు కానీ.. సర్పంచ్ ఎన్నికలు ఆ గ్రామంలో జరగలేదు. తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నికలకు బ్రేక్ పడింది.
ఇద్దరు సర్పంచ్ స్థానానికి(ఎస్టీ రిజర్వుడ్) నామినేషన్ వేశారు. గ్రామంలో 2258 ఓట్లు ఉండగా 1837 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1956 తర్వాత ఈ సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి మెస్రం దేవురావుకు 1028 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సిడాం లక్ష్మణ్‌కు 728 వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్తి 300 ఓట్లతో విజయం సాధించాడు.