నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, పోలీస్ స్టేషన్, పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ( Republic Day ) సోమవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం త్రివర్ణ పథకాన్ని ( Tricolor flag ) ఎగురవేశారు.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో విద్యార్థుల నృత్యాలు, ఉపన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆటల పోటీలు, నృత్యాలు, ఉపన్యాస పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు జాడి రాజలింగం, సత్యనారాయణ, ఎంపీడీవోలు పుల్లారావు, శ్రీనివాస్, ఎస్సైలు శ్రీ సాయి, ప్రణయ్ కుమార్, సర్పంచులు బానోత్ కావేరి, తోడసం రేణుక, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ తోడసం నాగరావ్, జేఏసీ చైర్మన్ మెస్రం రూప్ దేవ్, ప్రధానోపాధ్యాయుడు ధన్ను, ఆయాశాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.