కెరమెరి, జనవరి 4 : మండలంలోని కొలాం ఝరి గ్రామంలో ఆదివాసీలు భీమదేవుని వేడుకలను గురువారం వైభవంగా నిర్వహించారు. వారం రోజులుగా ఉత్సవాలు కొనసాగుతుండగా, గురువారం ఆఖరి రోజు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.
బుధవారం సాయంత్రం భీమదేవునికి స్నానాలు చేయించి మహాపూజ నిర్వహించిన సిడాం వంశీయులు గురువారం ఉదయం నుంచి సాయంత్ర వరకు సంప్రదాయ వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ సంబురాలు జరుపుకున్నారు. అక్కడే వంటలు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు.