బేల : రైతులు పండించిన పంటలను మార్కెట్ యార్డ్‌లోనే (Market Yard) అమ్ముకొని ప్రభుత్వం అందించిన పూర్తి మద్దతు ధర పొందాలని మండల వ్యవసాయ శాఖ అధికారి సాయి తేజ అన్నారు. మంగళవారం బేలా మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్‌లో కందుల( Redgram ) కొనుగోళ్లను దోప్టాల సొసైటీ అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన కందులను మార్కెట్ యార్డ్ కు తీసుకువచ్చి మద్దతు ధర ( Support Price) రూ.7,550 పొందాలని సూచించారు. పండించే ప్రతి పంటను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారుల వద్దకు వచ్చి తమ పంటలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు ఉమర్, నగేష్, రాజు, డోప్టల సొసైటీ సీఈవో రాహుల్, బేల సీఈవో తిరుపతి, సిబ్బంది గణేష్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.