జైపూర్, అక్టోబర్ 23: జాతీయ రహదారి 163జీ నిర్మాణానికి జైపూర్ మండలంలో ని ర్వహిస్తున్న భూసేకరణ సర్వే ప్రక్రియ వేగవం తం చేయాలని అధికారులను మంచిర్యాల కలెక్టర్ కుమార్‌దీపక్ ఆదేశించారు. బుధవా రం ఆర్డీవో రాములు, తహసీల్దార్ వనజారెడ్డితో కలిసి సర్వే పనులను పరిశీలించారు. మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ జాతీయ రహదారి నిర్మాణానికి మండలంలో ని జైపూర్, టేకుమట్ల, ఎల్కంటి, శెట్పల్లి, నర్సింగాపూర్, బెజ్జాల, కుందారం, రొమ్మిపూ ర్, కిష్టాపూర్, వేలాల గ్రామాల నుంచి 110 హెక్టార్ల భూమి అవసరం కాగా 83 హెక్టార్లు ఇప్పటికే సేకరించారు. మిగతా భూమి సేకరణలో వివిధ కారణాలతో జాప్యం జరుగుతున్నది. ఈ మేరకు సర్వే పనులు పరిశీలించి, రహదారి నిర్మాణంలో కోల్పోతున్న అటవీశాఖ భూములకు ప్రత్యామ్నాయ భూములను గుర్తించాలని, అటవీశాఖ ద్వారా అవససరమైన అనుమతుల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. అధికారులు, భూ యజమానులు, రైతులు సమన్వయంతో భూసేకరణపై ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
లక్షెట్టిపేట, అక్టోబర్ 23: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. లక్షెట్టిపేటలోని మహాత్మా జ్యోతిబా ఫూలే కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రీడల్లో రాణించిన వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ప్రత్యేక రిజర్వేషన్ కోటా ఉంటుందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన సుమారు 450 మంది క్రీడాకారులు క్రీడల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీబీసీడీవో వినోద్‌కుమార్, డీసీవో శ్రీధర్, కళాశాల ప్రిన్సిపాల్ రోనాల్డ్ కిరణ్, పీఈటీలు, పీడీలు క్రీడాకారులు పాల్గొన్నారు.
రిజిస్టర్లలో వివరాలు నమోదు చేయాలి
మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 23 : జిల్లాలో ఆశ కార్యకర్తలు అందిస్తున్న ఆరోగ్య కార్యక్రమాల వివరాలను రిజిస్టర్లలో కచ్చితంగా నమోదు చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని కలెక్టరేట్లో డీఎంహెచ్‌వో హరీశ్ రాజ్, వైద్యాధికారులు కృపాబాయి, పీవో ఫయాజ్‌తో కలిసి ఆశ కార్యకర్తలకు రిజిష్టర్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆశ కార్యకర్తలు 651 మంది ఉన్నారని వీరికి 3,515 రిజిస్టర్లను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి అనిల్, డెమో వెంకటేశ్వర్లు, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.