అంబేద్కర్ చౌక్, ఆగస్టు 12 : సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వచ్చే అర్జీదారులకు నిరాశే మిగులుతున్నది. ప్రతి సోమవా రం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ మధ్యాహ్నం ఒంటిగంట వరకే సాగుతుండగా, ఆపై ఆయా ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వా రి మొర ఆలకించేవారు లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు.
మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే సరికే మధ్యాహ్నం ఒంటిగంట దాటుతుందని, తాము వచ్చే సరికి అధికారు లు భోజనానికి వెళ్లిపోవడం.. ఆపై ఇతర మీటింగ్‌లలో బిజీగా ఉండడంతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రజలు పేర్కొంటున్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఆధ్వర్యం లో గ్రీవెన్స్ నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత అధికారులంతా లంచ్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత వచ్చిన అర్జీదారులు గ్రీవెన్స్ చాంబర్లో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్‌కు దరఖాస్తులు ఇచ్చి వెళ్లిపోయారు.
ప్రజా సమస్యల పరిషారానికి కృషి
-జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ
ఆసిఫాబాద్ టౌన్, ఆగస్టు 12 : ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరి శీలించి పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరివేణు, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు.
సమన్వయంతో ముందుకెళ్తాం
మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, ఆగస్టు 12 : ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతీలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు రాములు, హరికృష్ణతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు.