బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతినిధుల సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్, ఖానాపూర్, బోథ్, ముథోల్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, అజ్మీరా రేఖానాయక్, రాథోడ్ బాపురావ్, గడ్డిగారి విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్ తరలివెళ్లారు.