నిర్మల్ టౌన్, ఏప్రిల్ 4 : నిర్మల్ జిల్లా ఏర్పాటు తర్వాత వాణిజ్య, వ్యాపారపరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం గిరిజన సంక్షేమశాఖ, ఐటీడీఏ ఆధ్వర్యంలో లబ్ధిదారుడికి మంజూరైన కాంక్రీట్ మిషిన్‌ను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ.. జిల్లాలో సీసీ రోడ్లు, ప్రభుత్వ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.
ఈ నేపథ్యంతో యంత్రీకరణపై ప్రాధాన్యత పెరుగుతున్నదని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి గంగాధర్‌గౌడ్, కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజి రాజేందర్, మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.