Asifabad Journalists| ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, జూన్ 22 : జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆసిఫాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్, శ్రీనివాస రావులు అన్నారు. ఎన్నికల కోర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆసిఫాబాద్ నూతన ప్రెస్ క్లబ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విభేదాలు సాధారణంగా ఉంటాయని ఎన్నికల తర్వాత అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుందన్నారు.
ప్రజా సమస్యలు వెలికితీయడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. అంతకుముందు కోర్ కమిటీ సభ్యులు రామ్మోహన్, రహమాన్, మహేష్, సురేష్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు మొదటి నుండి సభ్యులు ఎంతగానో సహకరించారని అన్నారు. ఎంత సజావుగా ఎన్నికలు జరిగాయో అంతే సజావుగా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ పని చేయాలన్నారు. జిల్లా కేంద్రం ఎంతో ముఖ్యమైనదని జర్నలిస్టు సంఘాలకతీతంగా పనిచేయాలన్నారు. జర్నలిస్టులపై సదాభిప్రాయం కలిగేలా చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు హనుమయ్య, తారు, సలీం, కృష్ణంరాజు, టియుడబ్లుజే(143) జర్నలిస్ట్ యూనియన్ నాయకుడు రవినాయక్, రాజు, వెంకటేష్, ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రకాష్ గౌడ్, హరికృష్ణ, రాధాకృష్ణ చారి, సురేష్ చారి, ఆశిష్, భీమేష్ పాల్గొన్నారు.
ప్రెస్ క్లబ్ నూతన కమిటీ
ఆసిఫాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా వేణుగోపాల్ ఎన్నిక కాగా, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్, కోశాధికారిగా శ్రీధర్, గౌరవ అధ్యక్షుడిగా బాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా అడప సతీష్, వెంకట్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా నితేష్, రాజ్ కుమార్, అబ్దుల్ హన్నన్, జాయింట్ సెక్రటరీలుగా రమేష్ సోలంకి, సాజిద్ ఖాన్, అసిస్టెంట్ సెక్రటరీలుగా రవి, జానకిరామ్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా భాస్కరచారి, కుమార్ యాదవ్, శ్రీకాంత్, రాందాస్, సలహాదారులుగా బాపగౌడ్, శంకర్, గిరీష్, సతీష్ లు ఎంపికయ్యారు.