వాంకిడి : ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని పెరుకవాడ, మండోకార్ వాడ గ్రామస్థులు తాగు నీటికి (Driniking Water)అనేక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ యువ మోర్చా ( Yuva Morcha) రాష్ట్ర అధికార ప్రతినిధి యెలగతి సుచిత్ ఆరోపించారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిషన్ భగీరథ నల్లాలు ఉన్నా ప్రజలకు మంచినీరు అందడం లేదని ఆరోపించారు.
మిషన్ భగీరథ ఏఈ శైలేందర్ కు ఎన్నోసార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని వాపోయారు. సమస్యను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు తాగునీరు అందించాలని లేనిపక్షంలో ఖాళీ బిందెలతో ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా మండల అధ్యక్షుడు వికాస్, ఉపాధ్యక్షుడు సాయి , కార్యదర్శి అక్షయ్ ఉన్నారు.