నమస్తే నెట్వర్క్ : సమస్యలు పరిష్కరించాలని కోరు తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు శుక్రవారం మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టరేట్లతో పాటు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపట్టారు. నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట ఐక్య ఉద్యో గ సంఘాల ఆధ్వర్వంలో మధ్యాహ్న భోజన సమయంలో నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ కుమా ర్ దీపక్‌కు వినతి పత్రం అందజేశారు. జిల్లా ఐక్య ఉ ద్యోగ సంఘాల చైర్మన్ గడియారం శ్రీహరి, సెక్రెటరీ వనజారెడ్డి మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టీజీఈజేఏసీ కో చైర్మన్లు పొన్న మల్లయ్య, శ్రీనివాస్ రావు దేశపాండే పాల్గొన్నారు.
కన్నెపల్లి మండల కేం ద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ ఎం ప్లాయీస్ టీచర్స్ అండ్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ రాచంందర్కు వినతి పత్రం అందించారు. జి ల్లా అధ్యక్షుడు ఆలం పోచయ్య, జిల్లా చైర్మన్ జయకృష్ణ పాల్గొన్నారు. కోటపల్లి మండల కేంద్రంలో ఉద్యోగు లు, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కోటపల్లి తహసీల్దార్‌కు సమస్యలపై వినతి పత్రం అందించారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర సహాధ్యక్షుడు బిల్ల తిరుపతయ్య ఉన్నారు. బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు నల్లబాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
డీపీవో వెంకటేశ్వర్రావు, సబ్‌కలెక్టర్ ఏవో హన్మంతరావు, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీవో మహేందర్, మున్సిపల్ కమమిషనర్ సంపత్‌రెడ్డి, ఎంపీవో శ్రీనివాస్, టీజీఈ జేఏసీ కో చైర్మన్ చంద్రశేఖర్, టీఎన్జీవో యూనియన్ అధ్యక్షుడు వెంకటేశం పాల్గొన్నారు. చెన్నూర్ తహసీల్దార్‌కు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర సేవా వింగ్ కో కన్వీనర్ సయంపు శ్రీనివాస రావు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. తపస్ జిల్లా కార్యదర్శి నాగారాజు పాల్గొన్నారు. కాసిపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద కాసిపేట మండల ఉపాధ్యా య, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి, ఆపై సమస్యలపై తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. అలాగే కాసిపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం మండల పరిషత్ ఉద్యోగులు నల్ల బ్యా డ్జీలతో నిరసన తెలిపారు.

టీజీఈజేఏసీ నాయకులు పాల్గొన్నారు. దం డేపల్లి ఉన్నత పాఠశాలలో భోజన విరామ సమయం లో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ అహ్మద్ ఒమ ర్ హుస్సేన్ ఉపాధ్యాయ,ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి నిరసన తెలిపారు. కెరమెరి తహసీల్దార్‌కు ఉపాధ్యాయ సంఘాల నాయకులు శుక్రవారం వినతిపత్రం అందించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పీఆర్టీయు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ ఆడే ప్రకాశ్ ఉ న్నారు. తిర్యాణి మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, తహసీల్దార్ కార్యాలయాలం ఎదుట మండల పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల నిరసన వ్య క్తం చేశారు.
పీఆర్టీయూ మండల అధ్యక్షుడు శ్రీనివా స్, ఎంఈవో అంజయ్య పాల్గొన్నారు. కాగజ్‌నగర్ ము న్సిపల్ కార్యాలయ ఆవరణలో భోజన విరామ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మున్సిపల్ ఉద్యోగుల సంఘం జి ల్ల్లా అధ్యక్షుడు కుంటాల నారాయణ, కార్యదర్శి రఫీక్ అహ్మద్, ఉపాధ్యక్షులు సుధాకర్, సుజాత, సంయుక్త సెక్రటరీ ఫాతిమా బేగం పాల్గొన్నారు. అలాగే ప్రభు త్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో నల్లా బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం కాగజ్‌నగర్ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించా రు. పెంచికల్పేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయు లు, కార్మికులు, పెన్షనర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
తహసీల్దార్ తిరుపతికి వినతి పత్రం అందించారు. టీజీఈజేఏసీ మండల బాధ్యులు యాదగిరి, టీజీఈజేఏసీ మండల బాధ్యులు కొయ్యడ సాయికుమార్ గౌడ్ పాల్గొన్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల డిప్యూటి తహసీల్దారు భీమ్లానాయక్‌కు మెమోరాండం సమర్పించారు. టీజీఈజేఏసీ కొమురంభీం జిల్లా కో కన్వీనర్ అబ్దుల్ హకర్ ఉన్నారు. రెబ్బెన తహసీల్దార్ కార్యాలయం వద్ద పీఆర్టీయూ రెబ్బెన శాఖ ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పీఆర్టీయూ మండల అధ్యక్షుడు బత్తుల సదానందం, రాష్ర్టా ఉపాధ్యక్షుడు గాజుల రవీందర్, తదితరులు పాల్గొన్నారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దహెగాం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో మునావర్ షరీఫ్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. వీఆర్ఏలు దర్గం అంకులు, కొటారి భీమక్క కంచేశ్వరి, తదితరులు ఉన్నారు.