శ్రీరాంపూర్, జూలై 5 : సింగరేణిలో కారుణ్య ఉద్యోగాలిచ్చిన ఘనత కేసీఆర్‌దేనని, కార్మికులు ఆయనను జీవితాంతం గుర్తుకు పెట్టుకుంటారని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం శ్రీరాంపూర్ ఆర్కే న్యూటెక్ గనిపై బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బండి రమేశ్, ఆర్కే న్యూటెక్ గని పిట్ కార్యదర్శి జయపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గని జనరల్‌బాడీ సమావేశంలో సురేందర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. రానున్న గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను దోపిడీ చేస్తూ, కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు. టీబీజీకేఎస్, బీఆర్ఎస్ కాలంలో సింగరేణి అభివృద్ధి చెందిందన్నారు.
కేసీఆర్ తీసుకొచ్చిన కారుణ్య ఉద్యోగాలతో సింగరేణిలో దాదాపు 18000 మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. నెలకు 3 మెడికల్ బోర్డులు నిర్వహించి, ప్రతీ నెల 500 మంది యువకులకు ఉద్యోగాలు కల్పించారన్నారు. రాబోయో గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్‌కు గుర్తింపు హోదా కల్పిస్తేనే కార్మికులకు కారుణ్య ఉద్యోగాలు కొనసాగుతాయన్నారు.
కేంద్ర చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పొగాకు రమేశ్, సెం ట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అవినాష్‌రెడ్డి, సెంట్రల్ కమిటీ నెంబర్ లాలా, బ్రాంచ్ నాయకులు వెంగల కుమారస్వామి, ఏరియా చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవేందర్, నవీన్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్, ఏరియా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీకాంత్, షిఫ్ట్ సెక్రటరీ రాజు, షిఫ్ట్ ఇన్చార్జులు రాజ్‌కుమార్, నాయకులు రాజు, రవి, విద్యాసాగర్, భాసర్, సది, కిశోర్, వేణు, అజయ్, ప్రశాంత్, నరేశ్, రాంబా బు, రాజమల్లు, ఏశ్వంత్రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.