కోట్లు వృథా.. రూ3.38 కోట్లతో నిర్మాణాలు.. నిధుల కొరతతో భారమైన నిర్వహణ
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గల బంగారుగూడ డంపింగ్ యార్డులో ఏర్పాటు చేసిన ఎనిమల్ కేర్ సెంటర్, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎఫ్ఎస్టీపీ)లు నిరుపయోగంగా మారాయి.
- ఆదిలాబాద్ బల్దియాలో నిరుపయోగంగా ఎనిమల్ కేర్ సెంటర్, ఎఫ్ఎస్టీపీ
ఆదిలాబాద్, ఫిబ్రవరి 6(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గల బంగారుగూడ డంపింగ్ యార్డులో ఏర్పాటు చేసిన ఎనిమల్ కేర్ సెంటర్, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎఫ్ఎస్టీపీ)లు నిరుపయోగంగా మారాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఆగస్టు 17, 2021లో పారిశుధ్య నిర్వహణతోపాటు వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి రూ.2.56 కోట్లతో ఎఫ్ఎస్టీపీని నిర్మించారు.
మలం ద్వారా ఎరువును తయారు చేయడానికి ఎఫ్ఎస్టీపీ ఉయోగపడుతుంది. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల తమ ఇండ్లలోని సెప్టిక్ ట్యాంకులు నిండిపోతే సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎఫ్ఎస్టీపీ తరలిస్తారు. ఇక్కడ తయారైన ఎరువులను హరితహారంలో నాటిన మొక్కలకు ఉపయోగిస్తారు.
ఎనిమల్ కేర్ సెంటర్
డంపింగ్‌యార్డులో రూ.82 లక్షలతో ఎనిమల్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని కుక్కల బెడదను నివారించడంతోపాటు వాటి సంతానం నివారణకు ఈ కేంద్రం ఉపయోగపడుతుంది. గతంలో పట్టణంలోని వీధి కుక్కలను మున్సిపాలిటీ సిబ్బంది బోనుల ద్వారా ఈ కేంద్రానికి తీసుకొచ్చే వారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ టీకాలు వేసి కొన్ని రోజులపాటు రక్షించి తిరిగి వీధుల్లో వదిలేసేవారు.
ఈ కేంద్రం పనిచేయడం లేదు. డంపింగ్ యార్డులో ఎనిమల్ కేర్ సెంటర్, ఎఫ్ఎస్టీపీలు నిర్వహణను మున్సిపల్ అధికారులు గాలికి వదిలేశారు. దీంతో రూ.3.38 కోట్లతో నిర్మించిన రెండు కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ఇందులోని యంత్రాలు పనికిరాకుండా పోయాయి. పట్టణంలోని పారిశుధ్య నివారణతోపాటు వాతావరణ కాలుష్యం, కుక్కల బెడద నివారించడానికి ఏర్పాటు చేసిన కేంద్రాలు పనికిరాకుండా పోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

