సీసీసీ నస్పూర్, సెప్టెంబర్ 21: మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ప్రోద్బలంతోనే నస్పూర్‌లో ఇండ్ల కూల్చివేతలు జరుగుతున్నాయని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆరోపించారు. శనివారం నస్పూర్-శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారం అడ్డంపెట్టుకుని బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలు జరుగుతున్నాయన్నారు. దీంతో పేద, మధ్య తరగతి సామాన్యుల్లో భయాందోళన నెలకొన్నదన్నారు. ప్రశాంతంగా ఉన్న మంచిర్యాల నియోజకవర్గంలో ఒక అలజడి వాతావరణాన్ని తీసుకువస్తున్నారని మండిపడ్డారు.
ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు బీఆర్ఎస్ నేతలపై కక్ష గట్టారని, ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నేత డీకొండ అన్నయ్య ఐదు అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేశారని అన్నారు. అన్యాయంగా ఆయన ఇల్లును కూలగొట్టడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు స్పందించి, కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలను ఖండించాలని కోరారు. నస్పూర్‌లో చాలా మంది అసైన్డ్ భూముల్లో ఇండ్లు కట్టుకున్నారని, పార్టీ ఏదైనా ఏనాడూ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని తెలిపారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి అన్నయ్య కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి, ఇల్లును కూల్చివేశారని, ఇంట్లోని సామగ్రిని తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వకపోవడం దారుణమన్నారు.
అధికారులు కనీసం మానవతాదృక్పథంతో ఆలోచించకుండా ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదని, అధికారం ఎవరికీ సొంతం కాదన్నారు. అధికార పార్టీ నాయకులు డబ్బులు సంపాదించేందుకు పక్కా ప్రణాళిక ప్రకారం కూల్చివేతలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కూల్చివేతలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తే రానున్న రోజుల్లో కాంగ్రెస్ నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. తాము అధికారంలో ఉండగా, అందరికీ పట్టాలు ఇచ్చామే తప్పా.. ఎవరి ఇండ్లు కూల్చివేయ లేదని గుర్తుచేశారు.
అన్నయ్య కుటుంబ సభ్యులను మాజీ ఎ మ్మెల్యే దివాకర్‌రావు పరామర్శించారు. పో లీస్లు తమపై నిర్బంధకాండ కొనసాగించి, ఇంటి సామగ్రిని తీసుకోకుండా అరెస్ట్ చేసి, చివరికి తమపైనే కేసులు పెట్టారని డీకొండ అన్నయ్య, దివాకర్‌రావుకు తెలియజేస్తూ కన్నీటి పర్యంతమైయ్యారు. దీంతో ఒక్కసారిగా దివాకర్‌రావు భావోద్వేగానికి గురై కం టతడి పెట్టారు. అధైర్య పడవద్దని, తామం తా అండగా ఉంటామని ఆయన భరోసానిచ్చారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మెరు గు పవన్, నాయకులు ఎర్రయ్య, హైమద్, జక్కుల రాజేశం, రఫిక్‌ఖాన్, పెరుమాళ్ల జనార్దన్, గుమ్మడి శ్రీనివాస్, అడ్లకొండ రవిగౌడ్, బండారి తిరుపతి, తిరుమల్‌రావు, తిప్పని తిరుపతి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.