మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 8 : మంచిర్యాల జిల్లాలో 2025-27 సంవత్సరానికిగాను మద్యం దుకాణాల దరఖాస్తుల టెండర్ స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రఘురామ్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్రోడ్డులో గల సన్సైన్ సీనియర్ సిటీజన్ డే కేర్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఏ-4 మద్యం దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 73 మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియ ఊపందుకుందన్నారు. బుధవారం 6 దరఖాస్తులు రాగా, ఇప్పటి వరకు మొత్తంగా 14 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ నందగోపాల్, సీఐ గురువయ్య, బెల్లంపల్లి సీఐ ఇంద్రప్రసాద్, లక్షెట్టిపేట సీఐ సమ్మయ్య, చెన్నూర్ సీఐ హరి పాల్గొన్నారు.