తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీల్లో జాతీయ జెండాలు రెపరెపలాడాయి. మంచిర్యాల కలెక్టరేట్లో విప్ బాల్క సుమన్, ఆసిఫాబాద్ కలెక్టరేట్లో విప్, ఎమ్మెల్సీ సుంకరి రాజు పతాకావిష్కరణ చేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సమైక్య రాష్ట్రంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిపై ప్రసంగించారు. తెలంగాణ గడిచిన తొమ్మిదేళ్లలో అద్భుతాల సమాహారంగా మారిందని, సంక్షేమం, అభివృద్ధిలో యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఆయాచోట్ల నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. జడ్పీ చైర్పర్సన్లు భాగ్యలక్ష్మి, కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, కలెక్టర్లు సంతోష్, బోర్కడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్లు రాహుల్, చాహత్‌బాజ్‌పాయ్, రాజేశం, ఎస్పీ సురేశ్‌కుమార్ పాల్గొన్నారు.
– మంచిర్యాల ప్రతినిధి/కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 2(నమస్తే తెలంగాణ)
అమరుల త్యాగాల సార్థకతే ఆశయం..మహనీయుడు అంబేదర్ సూచనలే మార్గదర్శనం.. పచ్చని పొలాల్లోనా.. పారే సెలయేరులోనా అభివృద్ధి సాగైంది.. బంజరు భూముల్లో బంగారం పండించి.. భారతావనికే అన్నపూర్ణగా తెలంగాణ నిలిచింది.. కొలువులకు నెలవై.. ప్రగతి కేతనమై రెపరెపలాడింది.. ఆత్మగౌరవ దివిటీగా.. సబ్బండ వర్గాల ఆనందపు వెలుగయింది.. భువనమంతా నిండిన భవన విజయపు కేతనాలతో హరివిైల్లె విరిసింది… సంకెళ్లను తెంచుకుని.. స్వతంత్రంగా నిలబడి.. గెలిచి నిలిచిన ప్రస్థానానికి నేటితో దశాబ్దం.. సమర్థ నాయకత్వం.. సుస్థిర ప్రభుత్వంతో.. దేశానికే ఆదర్శంగా నిలిచిన ప్రగతి ప్రస్థానంలో నేడు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం
-ప్రభుత్వ విప్ బాల్క సుమన్
Telangana State Decade Cele
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం అట్టహాసంగా మొదలయ్యాయి. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని మంచిర్యాల కలెక్టరేట్లలో విప్‌లు బాల్క సుమన్, ఎమ్మెల్సీ సుంకరి రాజు పతాకావిష్కరణ చేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆయాచోట్ల జడ్పీ చైర్పర్సన్లు భాగ్యలక్ష్మి, కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, కలెక్టర్లు బదావత్ సంతోష్, బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు, అదనపు కలెక్టర్లు రాహుల్, చాహత్‌బాజ్‌పాయ్, రాజేశం, ఎస్పీ సురేశ్‌కుమార్ పాల్గొన్నారు.