నిర్మల్ అర్బన్, నవంబర్ 20 : అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందాలన్న దృఢ సంకల్పంతో అన్ని కుల సంఘ భవనాలకు భూ ములను కేటాయించి నిర్మించేందుకు కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని దివ్యనగర్‌లో రూ.10 లక్షలతో అయ్యప్ప మున్నూరు కాపు సంఘ భవనం, రూ.10 లక్షలతో యోగా వశిష్ట సంఘటన్ భవ న నిర్మాణాలకు ఆదివారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిర్మల్ నియోజకవర్గ ప్రజల సౌకర్యా ర్థం కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న సంకల్పంతో, యోగాను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో భవనాలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే విడుదల చేసిన రూ.10 లక్షలతో పాటు అదనంగా మరో రూ.10 లక్షలు కేటాయిస్తామన్నారు.
మున్నూరు కాపుల ఆత్మగౌరవ ప్రతీకగా ఏర్పాటు చేసిన అయ్యప్ప మున్నూరు కాపు సంఘ భవనానికి రూ.10 లక్షలతో పాటు అదనంగా మరో రూ.10 లక్షలు మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, యోగా ఉపాధ్యక్షులు నాలం శ్రీనివాస్, మారుగొండ రాము, డాక్టర్ కృష్ణం రాజు, అఖిలేశ్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
డిసెంబర్ కల్లా కలెక్టరేట్ పూర్తి చేయాలి
ప్రజలకు సకాలంలో మెరుగైన సేవలు అం దించాలన్న లక్ష్యంతో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవనం సత్వరమే పూర్తయ్యేలా చర్యలు తీ సుకోవాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సమీకృత కలెక్టరేట్ నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. దా దాపు పనులు పూర్తి కావచ్చాయని, పెండింగ్ ప నులను డిసెంబర్‌లోగా పూర్తి చేయాలన్నారు. సోమవారం ప్రారంభం కానున్న కలెక్టరేట్ అ ప్రోచ్ రోడ్డు ప్రాంతాన్ని పరిశీలించారు. పనులు పూర్తయితే నిర్మల్‌కు అదనపు హంగులు వస్తాయన్నారు. నాయకులు, అధికారులున్నారు.
గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
గ్రంథాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి మరిన్ని నిధులు వెచ్చిస్తున్నామన్నారు. 55వ జాతీయ గ్రంథాలయ ముగింపు వేడుకలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, డాక్టర్ వేణుగోపాలా కృష్ణ, వెంకట్, కవులు పురుషోత్తం, అంబటి నారాయణ, శంకర్, వెంకటేశ్వర్లు, నేరెళ్ల హన్మంతు, గ్రంథాలయ కార్యదర్శి రాజ్యలక్ష్మి, జ్ఞానేశ్వర్, విజయశ్రీ, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దళితుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం
సారంగాపూర్, నవంబర్ 20 : దళితుల అభ్యున్నతే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మండలంలోని చించోలి ఎక్స్‌రోడ్డు సమీపంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కోసం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల కోసం ప్రభుత్వం దళితబంధు పథకం కింద రూ.10 లక్షలు అందించి ఆర్థికంగా ఆదుకుంటుందన్నా రు. అన్ని వర్గాల ప్రజల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ నల్ల వెంకట్రామ్ రెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్ రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మాధవరావు, సర్పంచ్ చాట్ల లక్ష్మి, ఎంపీటీసీ వెంకట్రామ్ రెడ్డి, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.