అడవుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
తెలంగాణ సర్కారు అడవుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని అటవీ అభివృద్ధి శాఖ వీసీ అండ్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ అటవీ అభివృద్ధి శాఖ డివిజన్ కార్యాలయ ఆవరణలో మంగళవారం భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు
- అటవీ అభివృద్ధి శాఖ వీసీ అండ్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి
- కాగజ్‌నగర్ డివిజన్ కార్యాలయ ఆవరణలో భవన నిర్మాణానికి భూమిపూజ
కాగజ్‌నగర్, డిసెంబర్ 20 : తెలంగాణ సర్కారు అడవుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని అటవీ అభివృద్ధి శాఖ వీసీ అండ్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ అటవీ అభివృద్ధి శాఖ డివిజన్ కార్యాలయ ఆవరణలో మంగళవారం భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అడవుల అభివృద్ధి, ప్లాంటేషన్ నిర్వహణ కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నదన్నారు.
సిర్పూర్ మిల్లుకు ఈ ఏడాదిలో 90 వేల మెట్రిక్ టన్నుల నీలగిరి కర్రను సరఫరా చేసినట్లు స్పష్టం చేశారు. తెలంగాణ అటవీ అభివృద్ధి శాఖ డివిజన్ మేనేజర్, ప్లాంటేషన్ మేనేజర్ కార్యాలయాలు, సిబ్బందికి క్వార్టర్లు నిర్మించనున్నట్లు తెలిపారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.48 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సినియర్ డివిజన్ మేనేజర్ స్కైలాబ్, కాగజ్‌నగర్ డివిజన్ మేనేజర్ శ్రావణి, ప్లాంటేషన్ మేనేజర్ ఏ జలపతి, ప్లాంటేషన్ డిప్యూటీ మేనేజర్ దుర్గం రాకేశ్, బెల్లంపల్లి ప్లాంటేషన్ మేనేజర్ గోపీ ప్రసాద్, మంచిర్యాల ప్లాంటేషన్ మేనేజర్ శైలజ, చంద్రశేఖర్, పేపర్ మిల్లు డీజీఎం సురేందర్నార్కరే పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

