పేదలకు అండగా తెలంగాణ సర్కారు.. బోథ్ ఎమ్యెల్యే రాథోడ్ బాపురావు

నేరడిగొండ : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. బుధవారం నేరడిగొండలోని మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ…దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఇప్పటికే వందలాది మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ ద్వారా ఆదుకున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వాలు ఎన్నడూ ప్రజల సంక్షేమం కోసం పనిచేసిందిలేదని విమర్శించారు.
అలాంటిది తెలంగాణ రాక ముందు పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులను బేరీజు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ జాదవ్ అనిల్, ఎంపీపీ రాథోడ్ సజన్, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దావుల భోజన్న, మండల కన్వీనర్ శివారెడ్డి, వైస్ ఎంపీపీ మహేందర్‌రెడ్డి, తాసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో అబ్దుల్సమద్, సీనియర్ అసిస్టెంట్ మీరాబాయి, నాయకులు సయ్యద్ జహీర్, చంద్రశేఖర్‌యాదవ్, గడ్డం భీంరెడ్డి, గాదె శంకర్, ఉప్పుపోశెట్టి, తదతరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

