సీసీసీ నస్పూర్: సాంకేతిక విద్యతో చక్కటి భవిష్యత్తు ఉంటుందని సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి గుండా శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన సీసీసీ నస్పూర్ లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. యాజమాన్యం సింగరేణి విద్యాసంస్థల్లో కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. ఖర్చుకు వెనకాడకుండా విద్యార్థులకు యాజమాన్యం అన్ని సదుపాయాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు. కళాశాలలో సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, నరసింహ స్వామి, వివిధ విభాగాధిపతులు రవీందర్, దామోదర్, సాంబమూర్తి, శ్రీ సుమన్, టీచింగ్, నాన్ టీచింగ్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.