కాసిపేట : విద్యార్థుల ఎదుగుదలకు ఉపాధ్యాయులే ప్రధాన కారణమని ఎంఈవో ముక్తవరం వెంకటేశ్వర స్వామి ( MEO Venkateshwar Swamy ) అన్నారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ డీఏవీ పాఠశాలలో శుక్రవారం లయన్స్ క్లబ్, దేవాపూర్ ఓరియంట్ గోల్డ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ( Teacher Day ) ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మెక్రో క్యాబినెట్ పీఎసీ ఫోరం చైర్పర్సన్ గొంది వెంకటరమణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 15 మంది ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎంఈవో మాట్లాడుతూ విద్యార్థులు సన్మార్గంలో తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని అన్నారు.
లయన్స్ క్లబ్ పీఎస్ ఫోరం చైర్పర్సన్ గొంది వెంకటరమణ మాట్లాడారు. టీచర్ వ్యవస్థ లేకుంటే అసలు ఏ వ్యవస్థ లేదన్నారు. అనంతరం లయన్స్ క్లబ్‌కు సేవలు అందించిన కాసిపేట మండల జర్నలిస్టులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో డీఏవీ ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మడావి వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఊటూరి సాయి కుమార్, కోశాధికారి నిఖిల్ రెడ్డి, ప్రసాద్, నామసాని రాజు, మాజీ సర్పంచ్ మడావి విజయ లక్ష్మీ, కుష్బూ దేవి, సునీతా దేవి, డీఏవీ స్కూల్ ఉపాధ్యాయులు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.