నార్నూర్ : హాజరు శాతం తక్కువ ఉన్న విద్యార్థులను కళాశాలలకు పంపించాలని కోరుతూ నార్నూర్( Narnoor) ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు తల్లిదండ్రులకు విన్న వించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు అధ్యాపకులు గురువారం మండలంలోని షేకు గూడా, ఖంపూర్ , గుండాల గ్రామాలను సందర్శించి, గ్రామ పటేల్ , పోషకులు , విద్యార్థుల సమక్షంలో కళాశాలకు రోజు రావాలని కోరారు.
ఈనెల 10వ తేదీ నుంచి అర్ధ వార్షిక పరీక్షలు ( Half Yearly Exams ) ఉంటాయని, పరీక్ష రుసుము కూడా ఈ నెల 14వ తారీకు వరకు చెల్లించాలని సూచించారు. కొంతమంది పోషకులు ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లలను రోజు కళాశాలకు పంపలేకపోతున్నామని పేర్కొన్నారు. గ్రామ పటేళ్లతో తల్లిదండ్రులకు, విద్యార్థులకు నచ్చజెప్పామని అధ్యాపకులు వివరించారు.