సీసీసీ నస్పూర్, సెప్టెంబర్ 25 : సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో కార్మికులకు 33 శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ నాయకులు, కార్మికులు బుధవారం ఆందోళనలు చేపట్టారు. శ్రీరాంపూర్‌లోని జీఎం కార్యాలయం వద్ద టీబీజీకేఎస్ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు పె ట్టం లక్ష్మణ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులు ధర్నా చేశారు. కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎస్వోటూజీఎంకు వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా పెట్టం లక్ష్మణ్ మాట్లాడుతూ 2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి రూ.4701 కోట్ల లాభాలు వచ్చినట్లు యాజమాన్యం ప్రకటించిందని, వాస్తవ లాభాల నుంచి సుమారు రూ. 1551 కోట్లు కార్మికులకు ఇవ్వాల్సి ఉండ గా, కేవలం రూ.796 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైందన్నారు.
33 శాతం లాభాల వా టాను ప్రకటించి, కేవలం 16 శాతమే చెల్లించాలనుకోవడం దారుణమన్నారు. కార్మికులకు న్యాయం జరిగే వరకూ యూనియన్ ఆధ్వర్యంలో దశల వారీగా నిరసనలు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పానుగంటి సత్తయ్య, పొగాకు రమేశ్, సాదుల భాస్కర్, గొర్ల సంతోష్, కురుమ వికాస్, బిరుదు శ్రీనివాస్, బోడగుంట తిరుపతి, రాజేశం, సల్మాన్, సదానందం, వెంకన్న, పాదం శ్రీనివాస్, మారం శ్రీనివాస్, మేడం తిరుపతి, చిప్ప రమేశ్, తుర్రం శ్రీకాంత్, కార్తీక్, మల్లికార్జున్ పాల్గొన్నారు.
మందమర్రి, సెప్టెంబర్ 25 : మందమర్రి జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్ నాయకులు, కార్మికులు ధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ కార్మికుల కష్టార్జితం వారికి దక్కే వరకూ టీబీజీకేఎస్ పోరాడుతుందన్నారు. తమ యూనియన్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఆందోళన లు, నిరసన కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏరియా ఎస్వోటు జీఎం రాజేశ్వర్ రెడ్డికి వినతి ప త్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, కేంద్ర ఉపాధ్యక్షులు బడికెల సంప త్ కుమార్, జే.రవీందర్, కేంద్ర డిఫ్యూటీ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, సీహెచ్ వెంకటరమణ, కేంద్ర జాయింట్ సెక్రటరీ బెల్లం అశోక్, దాసరి శ్రీనివాస్, ఏరియా నాయకులు ఈశ్వర్, సారంగపాణి, మధుసూదన్, తోట రాజిరెడ్డి, శివ, తిరుపతి, వై.శ్రీనివాస్, చక్రపాణి, బబ్బెర మల్లేశ్, హైమద్, సాయి, తోట శ్రీనివాస్ పాల్గొన్నారు.
రెబ్బెన, సెప్టెంబర్ 25 : బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి జీఎం కార్యాలయం వద్ద టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. బెల్లంపల్లి ఏరియా టీబీజీకేఎస్ యూనియన్ ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ సింగరేణికి లాభా లు తెచ్చి పెట్టిన కార్మికులకు అన్యాయం చేయడం దారుణమని, వారికి 33 శాతం వాటా చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. అనంతర ఏరియా జీఎం శ్రీనివాస్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు ధరావత్ మంగీలాల్, మారిన వెంకటేశ్వర్లు, అలవేణి సంపత్, ఓరం కిరణ్, మాంతు సమ్మయ్య, బొంగు వెంకటేశ్, రమేశ్, బాబురావు, సత్యనారాయణ ఉన్నారు.