సీసీసీ నస్పూర్/శ్రీరాంపూర్, జూలై 10 : నాలుగు నెలలుగా నిలిచి పోయిన సింగరేణి మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించాలని టీబీజీకేఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం శ్రీరాంపూర్ పర్యటనకు వచ్చిన సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) డాక్టర్ కిరణ్రాజ్కుమార్ను నస్పూర్ కాలనీలోని డిస్పెన్సరీ వద్ద నాయకులతో కలిసి కలిశారు. పలు మెడికల్ సమస్యలపై సీఎంవోకు వినతిపత్రం అందజేశారు. సురేందర్‌రెడ్డి మా ట్లాడుతూ మెడికల్ బోర్డు నిర్వహించకపోవడంతో అనారోగ్యంతో ఉన్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఆర్కే-8 డిస్పెన్సరీని 50 పడకల హాస్పిటల్‌గా ఉన్నతీకరించాలని, నస్పూర్‌కాలనీ, ఆర్కే-8 డిస్పెన్సరీల్లో సీటీస్కాన్, 2డీఎకోను అందుబాటులోకి తేవాలన్నారు. శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు రమేశ్, కేంద్ర సంయుక్త కార్యదర్శి సత్తయ్య, కేంద్ర చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి రమేశ్, ఆర్గనైజింగ్ కార్య దర్శి అన్వేష్‌రెడ్డి, రమేశ్, పిట్ కార్యదర్శి రాజునాయక్ పాల్గొన్నారు.
శ్రీరాంపూర్ ఆర్కే 8 డిస్పెన్సరీని సీఎంవో కిరణ్‌రాజ్‌కుమార్ సందర్శిం చారు. జీఎం ఎం శ్రీనివాస్‌తో కార్మికులను కలిసి వైద్య సేవల గురించి ఆరా తీశారు. 24 గంటలపాటు అందుబాటులో ఉండి సేవలందించాల ని వైద్యులకు సూచించారు. ఎస్వోటూజీఎం సత్యనారాయణ, ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వీరభద్రయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీసైదా, పిట్ కార్యదర్శి విజయలక్షి పాల్గొన్నారు.