శ్రీరాంపూర్, జూలై 6 : సింగరేణి గనుల వేలంపై టీబీజీకేఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ శనివారం ర్యాలీలు, ధర్నాలు నిర్వహించింది. బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ జీఎంలకు వినతిపత్రాలు అందజేసింది. శ్రీరాంపూర్‌లో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు పెట్టం లక్షణ్ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభించగా, కార్మికులు ప్రధాన వీధులగుండా జీఎం ఆఫీస్‌కు తరలివచ్చారు. ధర్నా నిర్వహించి గనుల వేలం, ప్రైవేటీకరణను విరమించుకోవాలని, ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాయాలని జీఎంకు వినతి పత్రం అందించారు.
అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి గనులను ప్రైవేటీకరిస్తే సంస్థలో శాశ్వత ఉద్యోగాలు ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి గుర్తించిన గనులను ఆ సంస్థకే అప్పగించాలని డిమాండ్ చేశారు. గనుల ప్రైవేటీకరణను అడ్డుకోకపోతే కాంగ్రెస్, బీజేపీలకు పట్టగతులుండవని హెచ్చరించారు. ఈ నెల 9న గోదావరిఖనిలో నిర్వహించే మహాధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారని, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీ ర్మానం చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎం పీలు, మంత్రులు, ఎంపీలకు వినతి పత్రా లు అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పానుగంటి సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేశ్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పెండ్రి అన్వేష్‌రెడ్డి, కేంద్ర నాయకులు గొర్ల సంతోష్, వికాస్, భాస్కర్, ఇసంపెల్లి ప్రభాకర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మేరుగు పవన్, కౌన్సిలర్లు వంగ తిరుపతి, పంబాల గంగా ఎర్రయ్య, బేర సత్యనారాయణ, మాజీ సర్పంచులు గుంట జగ్గయ్య, మల్లెత్తుల రాజేంద్రపాణి, నాయకులు వెంకటరమణారెడ్డి, ఉత్తేజ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రవీగౌడ్, బిరుదు శ్రీనివాస్, సిద్దం తిరుపతి, రఫీక్‌ఖాన్, తొంగల రమేశ్, ఎల్లయ్య, రాయలింగు, భానుచందర్, మధు, ప్రశాంత్, కాటం రాజు, రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
మందమర్రి, జూలై 6 : మందమర్రి జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గనులను సింగరేణికి అప్పగించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం ఏరియా జీఎం ఏ.మనోహర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, కేంద్ర డిఫ్యూటీ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్, బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు కొంగల తిరుపతి రెడ్డి, బోరిగం వెంకటేశ్, పంజాల ఈశ్వర్, కోరబోయిన లక్ష్మణ్, ఒడ్నాల రాజన్న, వెంకటరమణ, రాజనాల రమేశ్, కొట్టె రమేశ్, తోట శ్రీనివాస్, పెద్దపల్లి రాజయ్య, బెల్లం అశోక్, మధుసూదన్‌రెడ్డి, అందె శ్రీకాంత్, రంజిత్, వెంకటేశ్, శ్రీకాంత్, కారుకూరి తిరుపతి, బొడ్డు మల్లేశ్, సీపెల్లి రాజలింగు, శేఖర్, కారుకూరి తిరుపతి, కొత్తపల్లి ఉదయ్, రామునూరి రాజేశ్, భువనచంద్ర, మెస్కె రవి, భూపెల్లి కనకయ్య, భట్టు రాజ్‌కుమార్, పూసాల ఓదెలు, సోషల్ మీడియా వారియర్స్ పాల్గొన్నారు.
రెబ్బెన, జూలై 6 : తెలంగాణలోని బొగ్గు బ్లాకులన్నీ నామినేషన్ పద్ధతిపై సింగరేణికే కేటాయించాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు ధరావత్ మంగీలాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి జీఎం కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. బెల్లంపల్లి ఏరియా ఇన్చార్జి జీఎం మచ్చగిరి నరేందర్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యుడు ఓరం కిరణ్, ఏరియా కార్యదర్శి మారిన వెంకటేశ్, అలవేణి సంపత్, ఏరియా నాయకులు గజెల్లి చంద్రశేఖర్, మాంతు సమ్మయ్య, కార్యాలయ ఇన్చార్జి వంగ మహేందర్‌రెడ్డి, పిట్ కార్యదర్శులు మెరుగు రామేశ్, రాజేశం, నాయకులు దేవేందర్, బాపురావు, వెంకటేశ్, జూనియర్ తిరుపతి, గడ్డం రవీందర్, కైత స్వామి, వెంకయ్య, భిక్షపతి, చంద్రశేఖర్, అశోక్, విజ్జన్న, ఉస్మాన్, కొండు శంకర్, సమ్మయ్య, శ్రీనివాస్, రాజేందర్, శ్రీనివాస్ ఉన్నారు.
బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి జీఎం కార్యాలయం వద్ద హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఇన్చార్జి జీఎం మచ్చగిరి నరేందర్‌కు వినతిపత్రం అందించారు. హెచ్ఎంఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు పత్తెం రాజబాబు మాట్లాడుతూ సింగరేణి ప్రాంతంలో ఉన్న బొగ్గు బ్లాకులన్నీ సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ ఏరియా బ్రాంచ్ కార్యదర్శి శివారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎండీ గౌస్, కేంద్ర కమిటీ నాయకులు కొండ్ర శంకర్, ఏరియా కమిటీ నాయకులు ఎస్కే ఇనూస్, అసుపత్రి ఇన్చార్జి శ్రీనివాస్, సీహెచ్‌పీ పిట్ కార్యదర్శి ఆరీఫ్, ఎస్అండ్పీసీ అసిస్టెంట్ పిట్ కార్యదర్శి కిష్ణస్వామి, పిట్ కార్యదర్శి బాలేశ్, నాయకులు దీపక్‌రాజ్, రాజేశ్, తులసీరాం, లక్ష్మణ్, శంకరమ్మ, పార్వతి, రాజేశ్వరి, నాగరాణి ఉన్నారు.