తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూర్ తహసీల్ కార్యాలయంలో ఆదివాసీ మహిళలను( Tribal Women ) అవమాన పరిచిన తహసీల్దార్ జ్యోత్స్న ( Tahasildar Jyothsna )
క్షమాపణలు చెప్పాలంటూ ఆదివాసి గిరిజన మహిళలు డిమాండ్ చేశారు. బుధవారం తాండూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తమ పోడు భూముల ( Podu Lands ) సమస్యపై సోమవారం రోజున తహసీల్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేయడానికి ప్రయత్నించిన కిష్టంపేట గ్రామ పంచాయతీ ఆదివాసీ గిరిజన మహిళలు అవమానించారని తెలిపారు. తహసీల్దార్ జ్యోత్స్న మహిళల సమస్యలు వినాల్సిన బదులు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అగౌరవ పరిచారని మహిళలు గంగుల లక్ష్మి, టేకం జ్యోతి, టేకం సాలక్క, టేకం శంకరమ్మ, కోయ భాగ్య, ఊరడి బుజ్జమ్మ ఆరోపించారు.
ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నాయకులు స్పందిస్తూ, ఆదివాసీ మహిళలను అవమానించిన తహసీల్దార్ వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘం నాయకులు మండిగ రవీందర్, యాపల సమ్మయ్య, గడ్డం మణికుమార్, టేకం రాజేష్, ఊరడి మహేష్, మండిగ చిన్నయ్య, టేకం రాజయ్యతో పాటు ఆదివాసీ మహిళలు పాల్గొన్నారు.