నమస్తే బృందం, ఆగస్టు 2 : ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల వ్యాప్తంగా శుక్రవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. దండేపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్ర పటానికి, అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. లక్షెట్టిపేటలోని ఊత్కూర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. నాయకులు కాంతారావు, దర్మన్న, స్వామి, రాజలింగు, విక్రమ్, సోను, రవి, డిన్ను, సతీశ్ ఉన్నారు. శ్రీరాంపూర్‌లో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంథెన మల్లేశం ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మల్లేశం, నాయకులు గద్దెల బానయ్య, డాక్టర్ శరత్‌కుమార్, చుంచు శంకర్‌వర్మ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ తీశారు.
శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్, మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నాయకులు స్వామి, పెర్క సత్యనారాయణ, జూపాక సాయిలు, వేల్పుల రవీందర్, శ్రీరాములు, భూమయ్య, బోనాసి స్వామి, లక్షణ్, రేగుంట లింగయ్య, కుమార్ ఉన్నారు. మందమర్రిలోని సింగరేణి పాఠశాల వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఆది జాంబవ సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. సంఘం పట్టణ అధ్యక్షుడు వాసాల శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ బీదునూరి శంకర్, గౌరవ అధ్యక్షుడు కంబాల రాజనర్సు, ప్రధాన కార్యదర్శి అవునూరి పోశం, ప్రచార కార్యదర్శి దాసరి రాజనర్సు, నాయకులు గసికంటి పోశం, కసిపాక తిరుపతి, నాయిని శంకర్, కరుణాకర్, ఏల్పుల రవి, రాజ్‌కుమార్, రత్నం మొగిలి, అట్కపురం కుమారస్వామి, రాజేశం, నెరువట్ల రాజలింగు, ఉప్పులేటి నరేశ్, కర్రావుల రాజేశ్, తుంగపిండి ఉపేందర్, కుంబులు, దుర్గయ్య, సంగి రవి ఉన్నారు.
రామకృష్ణాపూర్ పట్టణంలోని కోదండ రామాలయం ఏరియాలో గల తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద ఎమ్మార్పీఎస్ నాయకులు నివాళులర్పించారు. బైక్ ర్యాలీ తీశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహంతో పాటు మంద కృష్ణ మాదిగ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్, రెల్లి సంఘం నాయకులు చెన్నూరి సమ్మయ్య, డాక్టర్ శరత్‌బాబు, జీడీ సారంగం, శివ, రాచర్ల సరేశ్, పోచయ్య, రాజేందర్, వెంకటేశ్, ఈశ్వర్, ఓదెలు, రామిల్ల మల్లేశ్, ఆగయ్య, చందర్, ప్రసాద్ పాల్గొన్నారు. నస్పూర్ అంబేద్కర్ భవన్ వద్ద దళిత నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నాయకులు కొప్పర్తి రాజం, కొయ్యల కొమురయ్య, మాడుగుల శంకర్, కొప్పర్తి సురేందర్, రాజు, మాడుగుల మహేశ్, కొయ్యల వెంకటేశ్వర్, రమేశ్, శంకర్, సాగర్, లింగయ్య, పోచయ్య పాల్గొన్నారు. మంచిర్యాలలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడి రమేశ్ ఆధ్వర్యంలో సంబురాలు చేశారు. వంగపల్లి వెంకటేశ్వర్రావు, తుల అంజనేయులు, జోగుల శ్రీదేవి, ముదాం మల్లేశ్, మల్యాల శ్రీనివాస్ పాల్గొన్నారు. రామకృష్ణాపూర్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు వేముల అశోక్, 11వ వార్డు కౌన్సిలర్ గడ్డం సంపత్, పార్టీ ప్రధాక కార్యదర్శి మాసు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు ముద్దసాని శ్రీనివాస్, వైద్య శ్రీనివాస్, సీనియర్ నాయకులు కుమ్మరి మల్లయ్య,
బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు సంతోశ్, రామ్ నాయక్, మోత్కూరి దేవేందర్, ఈదునూరి రంజిత్, కొండ రాజబాబు పాల్గొన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు) మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ చిత్రపట్టానికి పాలాభిషేకం చేశారు. నాయకులు కొత్తురి ఆంధ్రయ్య, జిల్లపెల్లి శంకర్, చిట్యాల శంకర్, ప్రేమ్‌సాగర్, ఆదివాసీ నాయకుడు కుస్రం నిలకంఠం ఉన్నారు. పెంచికల్పేట్ మండలం కొండపల్లిలో ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. నాయకులు పాపయ్య, సునీల్, ప్రవీణ్, అంజి, పెంటయ్య, రాహుల్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.