ఎదులాపురం, అక్టోబర్ 28 : ఆదిలాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులు, రైస్ మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీఎంఆర్ సరఫరా, పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సన్న బియ్యం మిల్లింగ్, సరఫరా పనులను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన అన్ని నిబంధనలు కచ్చితంగా పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్యామలదేవి, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి నందిని, డీఎం సుధారాణి పాల్గొన్నారు.