ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో గురువారం విద్యార్థులు ఇంటిబాట పట్టారు. తమను తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులతో కలిసి మంచిర్యాల బస్టాండ్‌కు చేరుకోగా.. ఆ ప్రాంతం కిక్కిరిసి పోయింది.
ఏ ప్లాట్‌ఫాంపై చూసినా సందడి కనిపించింది. అవసరమైనన్ని బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొంతమంది ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.
– మంచిర్యాల స్టాఫ్ ఫొటోగ్రాఫర్, జనవరి 11