కోటపల్లి : మంచిర్యాల జిల్లా కోటపల్లి ( Kotapalli ) మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని(Science Day ) ఘనంగా నిర్వహించారు. కోటపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, కోటపల్లి మోడల్ స్కూల్ లో సైన్స్ ఫెయిర్ ( Science Fair ) నిర్వహించి విద్యార్థులకు సైన్స్ గొప్పతనాన్ని వివరించారు. ప్రముఖ్య శాస్త్రవేత్త సీవీ రామన్ చిత్రపటానికి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఎస్వో హరిత ( Haritha) , మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజశేఖర్ ( Rajashekar ) పూలమాల వేసి నివాళి అర్పించారు.
వారు మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వైపు దృష్టిని సారించాలని సూచించారు. సమాజంలో వస్తున్న ఆధునిక , సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడూ విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలని, మూఢ నమ్మకాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. 1928లో భారత భౌతిక శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్నిజరుపుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైన్స్ సంబందిత అంశాల పై పోటీలను నిర్వహించి బహుమతులను అందచేశారు.