దండేపల్లి, జూన్2 : దండేపల్లిలోని భారతి విద్యానికేతన్ 1996-2001 ప్రైమరీ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. చదువులు ముగించుకొని భవిష్యత్‌ను వెతుక్కుంటూ వెళ్లిపోయిన విద్యార్థులంతా ఒకేచోట చేరి సందడి చేశారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. అనంతరం గురువులను సన్మానించారు.
సీసీసీ నస్పూర్, జూన్ 2: సీసీసీ సింగరేణి పాఠశాలలో 2003-04 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో సమ్మేళనం నిర్వహించారు. చాలా ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకొని నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడిపారు. ఆటా పాటలతో హోరెత్తించారు. జలీల్, నరేందర్, మల్లికార్జున్, గౌతమ్, సుధాకర్, రవి, నరేశ్, సమ్మయ్య, జ్యోతి, సృజన, అనిత, కవిత, మాధవి పాల్గొన్నారు.