బజార్ హత్నూర్ : దాదాపు 45 రోజుల వేసవి సెలవుల ( Summer Holidays ) అనంతరం హుషారుగా, ఉల్లాసంగా పాఠశాలలకు ( Schools ) చేరుకున్న తొలి రోజునే విద్యార్థులు అవస్థలు పడడం ప్రారంభించారు. బజార్హత్నూర్ (Bajar Hatnoor ) మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పిచ్చి మొక్కలు, నీటి గుంతలతో అపరిశుభ్ర వాతావరణం విద్యార్థులకు స్వాగతం పలికింది.
పాఠశాలలు పునఃప్రారంభం కావడం తో ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలో దుర్గంధం రావడంతో అతి కష్టం మీద విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి వెళ్లిపోయారు. ఈ పాఠశాలల్లో వేసవి సెలవుల్లో జొన్నల సబ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. అయితే కింద పడ్డ జొన్నలు వర్షానికి తడిసి వాసన రావడం, పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు, నీటి గుంతలు ఏర్పడడం తో పాఠశాల మొత్తం అపరి శుభ్రంగా మారింది. అధికారులు స్పందించి పాఠశాలలో పరిశుభ్ర వాతావరణం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.